రాష్ట్రంలో ప్రస్తుతం రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక పంటల పండిద్దామంటే సరైన ఎరువులు అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని ప్రకాశం జిల్లా వైసీపీ ఇన్చార్జ్ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని మరియు రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెవిన్యూ డివిజన్లో పరిధిలో సెప్టెంబర్ 9వ తేదీన రైతు సమస్యలపై రైతులతో కలిసి పోరాటం చేయడం జరుగుతుందని తెలిపారు రాష్ట్రానికి 7 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం లేదని కేంద్రానికి చెప్పటం దారుణం అన్నారు ఎరువులు లేకుండా పంటలు పండవని అన్నారు