తలమడుగు మండలం సుంకిడి గ్రామ సమీపంలోని అయ్యప్ప ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి హుండీని పగులగొట్టి డబ్బులు దోచుకెళ్లారు. అనంతరం గర్భగుడి తాళాలు పగులగొట్టి అయ్యప్ప మూల విగ్రహంపై ఉన్న ఆభరణాలను, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. చోరీకి ముందు ఆలయంలోని సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.