చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పచ్చకాపురం గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది గుర్తుతెలియని వ్యక్తులు అమ్మవారి ఆలయ తాళాలు పగలగొట్టి హుండీనెత్తుకెళ్ళారు బుధవారం ఉదయం ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.