రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎదురెదురుగా వస్తున్న డీసీఎం / కారు ఢీకొన్నాయి. స్థానికుల వివరాల ప్రకారం బడా పహాడ్ నుంచి లాతూర్ కు వెళ్తున్న కారు, బోధన్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న డీసీఎం ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు గాయాలు కాగా వారిని హుటాహుటిన బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘరానా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు