గుత్తి లో భారీ వర్షం కురిసింది. 86.2 మీల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు చెప్పారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. వర్షం కారణంగా అనంతపురం రోడ్డు, తాడిపత్రి రోడ్డు, రాయల్ సర్కిల్ ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్డుపై పరవళ్ళు తొక్కింది. డ్రైనేజీ కాలువలు నిండి మురుగు నీరు అంతా రోడ్లపై ప్రవహించింది. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. కరెంటు సరఫరాకు అంతరాయం తలెత్తింది.