కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల మండలం పోరుమామిళ్ల పట్టణంలోని అన్ని దేవాలయాలు గ్రహణం సందర్భంగా ఆదివారం సాయంత్రం నుండి మూసివేశారు. పోరుమామిళ్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, తదితర దేవాలయాలలో ప్రత్యేక పూజలు అనంతరం సాయంత్రం నుండి గ్రహణం సందర్భంగా దేవాలయాలను మూసి వేయడం జరిగింది. తిరిగి సోమవారం ఉదయం సంప్రోక్షణ చేసి దేవాలయాలను తెరవడం జరుగుతుందని ఆలయ పూజారులు తెలిపారు.