దేశవ్యాప్తంగా జీఎస్టి స్లాబ్ రేట్లు భారీగా తగ్గించినందుకు గాను హర్షం వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలను నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు నరేంద్ర రెడ్డి హాజరయ్యారు.