పెద్ద శంకరంపేట జ్యోతిబాపూలే బిసి బాలుర గురుకుల పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు విద్యార్థులు సన్మానం చేశారు. పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వింధ్యావత్ శ్రీను, అధ్యాపకులు పాల్గొన్నారు.