ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలో సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీగా వెళ్లి నటరాజ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు షేక్షావలి మాట్లాడుతూ డ్రైవర్స్ లేకుంటే రవాణా వ్యవస్థ సంభించిపోతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్స్ ని గుర్తించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.