బంగాళా ఖాతం లో అల్ప పీడనం ఏర్పడిన దృష్ట్యా రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆదేశించారు.సోమవారం 3pm PGRS అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలకు పంట నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చెరువులు,కాల్వల గట్లు పటిష్టంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.మండల స్థాయి అధికారులు క్షేత్ర స్థాయి లో పర్యటిస్తూ పరిస్థితుల పై కన్నేసి ఉంచాలని, పంట పాడైపోయింది, మునిగిపోయింది అనే మాట రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.లోతట్టు ప్రాంతాల పై దృష్టి పెట్టాలన్నారు