మైలార్దేవ్పల్లి డివిజన్లోని గణేష్ నగర్ లోని బంగారు మైసమ్మ ఆలయంలో ప్రతిష్టించిన గణనాథుడికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బుధవారం ఉదయం తొలి పూజ చేశారు. అనంతరం ఆయన తీర్థప్రసాదాలు స్వీకరించి మాట్లాడుతూ సిద్ధి బుద్ధి జ్ఞానం ప్రసాదించే గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజల సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. నియమ నిష్ఠలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.