కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తొమ్మిదో తేదీ అన్నదాతకు అండగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. యూరియా బ్లాక్ మార్కెట్ కి వెళ్లడంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన ఆరోపించారు