జిల్లాలో 10 వేలకు పైగా హెచ్ఐవి కేసులు నమోదు అయి ఉన్నాయని అవి పెరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పిలుపునిచ్చారు ఎయిడ్స్ వ్యాధిని అరికట్టడానికి యువతకు వ్యాధిపై అవగాహన కల్పించడానికి రాజమండ్రిలో బుధవారం 5కే మారధాన్ రెడ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పట్ల వివక్షత చూపరాదు అన్నారు. యువత ఎయిడ్స్ వ్యాధి పట్ల పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు