ఆదోని పట్టణంలో ట్రాఫిక్ సమస్య ప్రజలను ఇబ్బంది పెడుతోందని, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. ఎమ్మిగనూరు సర్కిల్ నుంచి కాలేజ్ రోడ్డువైపు వాహనాల రద్దీ పెరగడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. దుకాణదారులు రోడ్డుపై కట్టడాలు కట్టడం, వాహనదారులు రోడ్డుపైనే వాహనాలు నిలపడం సమస్యకు కారణమని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.