పలు విద్యార్థి సంఘాల నేతలు ఆదివారం విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరేడు రైతులకు బాసటగా నిలవాలని తీర్మానం చేశారు. ఇండో సెల్ కంపెనీను రద్దు చేయాలని, ఇండో సెల్ కంపెనీకి కేటాయించిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు కాలాలపాటు పంటల పండే భూములను సోలార్ ప్రాజెక్టులకు కట్టబెట్టడం సరైన విధానం కాదన్నారు. దొనకొండ లాంటి ప్రాంతాలను కావలసిన అంత ప్రభుత్వ భూములు ఉన్నాయని అక్కడ కంపెనీలను ఏర్పాటు చేయాలన్నారు. సేవ్ కరేడు ఉద్యమానికి విద్యార్థి సంఘాలు బాసటగా నిలుస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.