తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్,పెన్షనర్స్, కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ 1న అన్ని జిల్లాలలో కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ సందర్బంగా, జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముందు సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సెప్టెంబర్ 1 ని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ, ఉద్యోగులు జగిత్యాల జిల్లా TNGO అధ్యక్షులు, జిల్లా jac చైర్మన్ నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా జిల్లా jac చైర్మన్ నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్,పెన్షనర్స్, కార్మిక సంఘాల...