బుధవారం రోజున సంకష్ట చతుర్థి సందర్భంగా రాత్రి శ్రీ మడ్ల రామలింగేశ్వర స్వామి ఆలయంలో గల ఆ మహాగణపతికి భక్తులు ధూప దీప నైవేద్యాలను సమర్పించి తమ ఉపవాస దీక్షను విరమించారు ప్రతి మాసంలో ఒకరోజు వచ్చే సంకష్ట చతుర్దశి రోజున స్వామివారికి ఉపవాస దీక్ష చేపట్టి సాయంత్రం చంద్రోదయం అనంతరం భక్తులు తమ ఉపవాస దీక్షను విరమిస్తారు ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామి వారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి చంద్రోదయాన్ని దర్శించుకున్న అనంతరం ఆలయంలో ఆలయ సిబ్బంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడంతో భక్తులు తమ ఉపవాస దీక్షను ఆలయ ప్రాంగణం లోనే విరమించారు.