దాహేగం మండలం గిరవెల్లి కర్జి గ్రామాలకు వెళ్లే రహదారి బురదమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బురదమయంగా మారిన రోడ్డుపై వెళ్తుంటే వాహనాలు నడవలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ఈ పరిస్థితి ఉన్న అధికారులు ప్రజా ప్రతినిధులు మాత్రం పట్టించుకోవడంలేదని వివిధ గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు,