కుప్పం నియోజకవర్గంలో మూడు రోజులు బసవతారకం ఆసుపత్రి ఆధ్వర్యంలో అత్యధిక టెక్నాలజీతో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహిస్తామని ఎమ్మెల్సీ శ్రీకాంత్ గురువారం వెల్లడించారు. 30న కుప్పం ఏరియా ఆసుపత్రిలో 31న రామకుప్పం పీహెచ్సీలో సెప్టెంబర్ 1న శాంతిపురం పిహెచ్సిలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తారని చెప్పారు నియోజకవర్గంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.