ఉయ్యూరులో ఏపీ రాష్ట్ర డీలర్ల సంఘ అధ్యక్షులు కాగిత కొండ మాట్లాడుతూ, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ వల్ల నిర్వహణ వ్యయం పెరిగిందని, క్వింటాకు రూ. 100 నుండి రూ. 200 వరకు పెంచాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల పంపిణీ బాధ్యతను రేషన్ డీలర్లకు అప్పగించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.