గత ఆగస్టు నుంచి తమకు యాజమాన్యం జీతాలు చెల్లించడం లేదని దీంతో తాము తమ కుటుంబాలతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని తమను ఆదుకోవాలని కోరుతూ విశాఖపట్నం దువ్వాడ పరిధి వి ఎస్ ఈ జెడ్ లో సెనర్జీస్ కంపెనీలో పనిచేస్తున్న 457 మంది ఉద్యోగులు రోడ్డు ఎక్కి నిరసనలు తెలియజేశారు. యాజమాన్యం సరిగ్గా వేతనాలు చెల్లించకపోవడంతో గతంలోని పలుమార్లు ఇలాగే ఆందోళనలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. ఇప్పటికైనా ప్రభుత్వ యాజమాన్యాలు చర్యలు చేపట్టి తమకు సకాలంలో జీతాలు చెల్లించే విధంగా చూడాలని కోరారు.