ఆర్కే బీచ్ రోడ్డులో 14 ఎకరాల విలువైన స్థలాన్ని లులు మాల్కో కేటాయించడానికి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా ఉద్యమాన్ని లేవనెత్తునున్నట్లు 78వ వార్డు కార్పొరేటర్ సిపిఎం నాయకులు బి గంగారావు తెలియజేశారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో గురువారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ప్రజా వనరుల పరిరక్షణ సమితి పేరుతో లులు మన రద్దుకు పోరాటాన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందుతోందని కమిటీ సభ్యులను పరిచయం చేశారు.