కర్నూలు : కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యపోరాటం తప్పదని సిఐటియు న్యూ సిటీ నేతలు స్పష్టం చేశారు. కర్నూలు కొత్త బస్టాండ్ సమీపంలోని కార్మిక–కర్షక భవన్‌లో మూడో నగర మహాసభ తీర్మానాలపై మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. సిఐటియు సిహెచ్ సాయిబాబా మాట్లాడుతూ… ఆటో కార్మికులు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నారని, ఉచిత బస్సు పథకం వల్ల వారి జీవనం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఆటో కార్మికుడికి నెలకు రూ.12 వేల భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పెండింగ్ క్లెయిమ్స్‌కి నిధులు విడుదల చేయాలని కోరారు. లేనిపక్షంలో