భీమిలిలో మైనర్ బాలికపై అత్యాచారంపై భీమిలి పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసారు. భీమిలి మండలంలో మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేసినట్లు పిర్యాదుపై ఫోక్సో కేసు నమోదు చేసారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమిలి సిఐ బి.తిరుమలరావు ఫోక్సొ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.