సీఎం చంద్రబాబు నాయుడు తమ బ్రాండ్ అని చెప్పుకోవడానికి KIA పరిశ్రమ ఉదాహరణ అని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. బుధవారం ఆయన కియా పరిశ్రమను సందర్శించారు. అక్కడ జరిగిన అభివృద్ధిని చూసి సంతోషించినట్లు తెలిపారు. కియా రావడంతో 3వేల మందికి ఉద్యోగాలు లభించాయని, అనుబంధ సంస్థలతో మరో 15 వేల మందికి ఉపాధి లభించిందన్నారు. అభివృద్ధి, విజనరీకి చంద్రబాబు ఒక బ్రాండ్ అంబాసిడర్ అనడం గర్వంగా ఉందన్నారు