బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ భాషా దినోత్సవం మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు అధ్యాపకులు నిర్వహించారు. కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ యాసకు మాండలికానికి కాళోజి పెద్దపీట వేసి గుర్తింపు తీసుకువచ్చారని కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ గుర్తు చేశారు. తెలుగు విభాగాధిపతి గోపాల్ ఎన్సిసి అధికారి కృష్ణ ఎన్ఎస్ఎఫ్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్ డాక్టర్ రాజేష్ అనిత శంకర్ రావు పాల్గొన్నారు.