సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నదని పెద్దారవీడు ఎస్సై సాంబశివయ్య అన్నారు. మార్కాపురం సబ్ డివిజనల్ ఆఫీసర్ అనుమతి లేకుండా ఎలాంటి సభలు గానీ సమావేశాలుగాని ర్యాలీలు గాని చేయరాదని అన్నారు. ఇవాళ వైయస్సార్ పార్టీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. పోలీస్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీలు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.