ఖమ్మం నగరంలో ఆదివారం మధ్యాహ్నం నుండి భారీ వర్షం కురుస్తోంది. గత రెండు రోజులుగా ఎండలు ఉన్నప్పటికీ, అకస్మాత్తుగా వాతావరణం చల్లబడి వర్షం ప్రారంభమైంది. దీంతో రోడ్ల పైకి వరద నీరు చేరింది. ఖమ్మంలో వినాయక మండపాలలో కొందరు పిల్లలు సరస్వతీ పూజ నిర్వహిస్తున్నారు. ఈ వర్షం పూజలకు ఆటంకం కలిగిస్తుందేమోనని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.