చింతలమ్మనేపల్లి మండల కేంద్రంలో పొలాల అమావాస్య రోజు విషాదం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన జోడి గురుదాస్ ఎడ్లను కడగడానికి నీటిలో దిగి చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని తీసేందుకు స్థానికులతో కలసి ప్రయత్నిస్తున్నారు. పొలాల అమావాస్య పండుగ రోజున రైతు చనిపోవడంతో మండలంలో విషాద ఛాయలు అలుము కున్నాయి,