అవనిగడ్డ లో అవనిగడ్డ - కోడూరు ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన బత్తుల నాగరాజు (46) అనే వ్యక్తి మృతి చెందారు. ద్విచక్రవాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అవనిగడ్డ ఎస్ఐ శ్రీనివాసు తెలిపారు.