రాయదుర్గం పట్టణంలో రూ.30 లక్షల 15 వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మిస్తున్న తాగనీటి పైప్ లైన్ పనులను రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ కాలవశ్రీనివాసులు ప్రారంభించారు. బళ్లారి రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, పలువురు టిడిపి కౌన్సిలర్లు, అధికారులతో కలిసి జెసిబితో లాంచనంగా పనులు ప్రారంభించారు. పట్టణంలో తాగునీరు సౌకర్యం మెరుగుపరిచేందుకు ఈ పైప్ లైన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ సురేష్, ఏఈ నర్సింహులు, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.