గుంతలమైన పలు గ్రామాలకు రోడ్లను వెంటనే బాగు చేయాలని నేడు గురువారం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలోని భాజపా నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలులో విఫలం కావడం జరిగిందన్నారు. మండలంలోని పలు గ్రామాలకు రోడ్లు గుంతల మయంగా ఉన్నాయని వెంటనే రోడ్ల మరమ్మతులు చేయాలన్నారు. అలాగే గ్రామాలలో నిర్మిస్తున్న ఇండ్లకు 3 లక్షల రూపాయలు కేంద్రం నిధులు ఇవ్వడం జరుగుతుందని, మరుగుదొడ్లు నిర్మాణానికి, గ్రామాలలోని ఎల్ఈడి బల్బులకు, ఉచిత బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం