వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాటుకు ముందస్తుగా ganeshustav.net వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని డోన్ పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనుమతి పొందిన కమిటీలకు QR కోడ్ జారీ చేస్తామని, దాన్ని మండపం వద్ద అంటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గ్రామాలలో 3వ రోజు, పట్టణంలో 5వ రోజు నిమజ్జనం జరగాలన్నారు. డీజేలకు అనుమతి లేదని, ఎలాంటి గొడవలు జరగకుండా కమిటీలే జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు.