నేపాల్ నుంచి రేణిగుంటకు చేరుకున్న తెలుగు వారు నేపాల్లో చిక్కుకున్న పలువురు తెలుగు వారు కాసేపటి క్రితం రేణిగుంట ఎయిర్ పోర్ట్కు చేరుకున్నారు. వారు కాట్మాండ్ నుంచి ప్రత్యేక విమానంలో రాడానికి మంత్రి లోకేశ్ కృషి చేశారు. ఎయిర్ పోర్ట్ బయట వారికి పలువురు టిడిపి నాయకులు, కడప MLA స్వాగతం పలికారు. రేణిగుంటకు వచ్చిన వారిలో నెల్లూరు, అనంత, నంద్యాల, అన్నమయ్య, కడప, అనంతరం జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఈ మేరకు వారిని ప్రత్యేక బస్సులలో తరలించనున్నారు.