పెంటపాడు కూనాగార పేటలో ఆదివారం రాత్రి హత్య జరిగింది. గిరిధర్ (జాన్ బాబు), ముప్పిడి కేతన్ బాబు (38)లు మేనమామ, మేనల్లుళ్లు. కేతన్ మద్యానికి బానిసై తరచూ తల్లిని వేధించేవాడు. మద్యం మత్తులో ఆదివారం రాత్రి తల్లితో గొడవ పడుతుండగా మేనమామ గిరిధర్ వారించాడు. ఘర్షణ పెద్దదై కేతన్ పై గిరిధర్ కత్తితో దాడి చేయడంతో అతను మృతి చెందాడు. సోమవారం ఉదయం 9:30 కు ఘటనా స్థలాన్ని సీఐ ఆదిప్రసాద్, ఎస్సైలు పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది