రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు త్వరిత గతిన నిర్వహించాలని ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు విజయ శంకర్ కోరారు. ఆదివారం జన్నారం మండలకేంద్రంలో అమే మీడియాతో మాట్లాడారు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేక పాలన కుంటుబడిందన్నారు. గ్రామాల్లో ఎక్కడ ఉన్నా సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వించాలని,అందులో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేయాలని కోరారు.