దేవనకొండకు చెందిన చాకలి నరేశ్ తన 8 నెలల కుమారుడిని నీటి డ్రమ్ములో ముంచి చంపాడు. భార్యని విచక్షణ రహితంగా కొట్టాడు. ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. శుక్రవారం భార్య తరఫు బంధువులు నిందితుడు ఇంటికి చేరుకొని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని నియత్రించారు. అయినప్పటికీ నిందితుడి ఇంట్లోకి ప్రవేశించి ధ్వంసం చేసినట్లు స్థానికులు తెలిపారు.