యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 6,149 వేదికల్లో ఈనెల 14న యోగా ప్రదర్శనలు చేపడుతున్నట్లు కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం యోగాంధ్ర నిర్వహణపై నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లతో కలెక్టరేట్ నుంచి ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. యోగా కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.