భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బుధవారం ఉదయం 11 గంటలకు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించినట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల హక్కుల కోసం భూస్వాముల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి బహుజన ఆత్మగౌరానికి ,మహిళా చైతన్యానికి మార్గం చూపిన వీర వనితని,ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.