గిరిజన ఆశ్రమ పాఠశాలలో సరైన వైద్యం అందించడంలో జిల్లా అధికారులు పూర్తిగా విఫలమయ్యారని DYFI జిల్లా అధ్యక్షులు టీకానంద్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. తిర్యాణి మండలం పంగడి మదర ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి విషజ్వరంతో మృతి చెందాడు. ఆశ్రమ పాఠశాలను గిరిజన అధికారులు,జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. 2024లో 5గురు విదార్థులు,ఈ ఏడాది ఒక విద్యార్థి మృతి చెందడం చాలా బాధాకరమున్నారు.