శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రను మంగళవారం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, మాజీ ఎమ్మెల్యే పార్థసారధిలు ప్రారంభించారు. పట్టణంలోని ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన వరాహ సమేత వినాయకుడి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించి, రథం లాగి ఊరేగింపును ప్రారంభించారు. వందలాదిమంది పోలీసులు వినాయక నిమజ్జనానికి బందోబస్తును పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు.