తొలగించిన దివ్యాంగుల పెన్షన్ను పునరుద్దించాలని కర్నూలు కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు ధర్నా చేపట్టారు. సోమవారం ఉదయం 12 గంటలకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పై కక్ష పూరితమైన చర్యలు చేపట్టిందని నాలుగు లక్షల పింఛన్లను కట్ చేసిందని వారు తెలిపారు. కట్ చేసిన పింఛను పునరుద్ధరించాలని లేదంటే దివ్యాంగులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తారని హెచ్చరించారు.