కర్నూలు జిల్లాలో పత్తి తర్వాత అత్యధిక పంటగా ఉల్లి ఉందని, ఉల్లికి 2000 క్వింటాకు మద్దతు ధర ప్రకటించి ఉల్లి రైతును ఆదుకోవాలని సిపిఎం ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ ను కోరారు. శుక్రవారం కర్నూల్ కొత్త బస్టాండ్ వద్ద ఉన్న మార్కెట్ యార్డును సందర్శించి ఉల్లి రైతులతో మాట్లాడడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య లకు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి యస్ రాధాకృష్ణ, యం డి ఆనంద్ బాబు, టి రాముడు, జిల్లా కమిటి సభ్యులు వై నగేష్ లు వినతి పత్రం ఇచ్చి సమస్యలను వివరించారు. అన