బిజెపి మూడుసార్లు దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఆయన మాట్లాడుతూ, ఎలక్షన్ కమిషన్ తో కలిసి ఈవీఎంలను టాంపరింగ్ చేసి కూటమి ప్రభుత్వం వచ్చిందని మండిపడ్డారు. ఓట్ చోరీ అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం నిజమేనని దానికి మద్దతు ఇస్తున్నామని తెలిపారు.