కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని జామియా మసీదులో శుక్రవారం మహమ్మద్ ప్రవక్త 1500వ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా మీలాద్ ఉన్ నబి పండుగ నిర్వహించారు. జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్ షా సాదిక్ పాషా ఖాద్రి మహమ్మద్ ప్రవక్త పవిత్ర జ్ఞాపికలను భక్తులకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది ముస్లిం సోదర, సోదరీ మణులు, చిన్నారులు మహమ్మద్ ప్రవక్త పవిత్ర జ్ఞాపికలకు ప్రత్యేక ఫాతిహా నిర్వహించి తమ కోరికలు తీర్చాలని తమ జీవిత కాలంలో చేసిన పాపాలు మన్నించాలని వేడుకున్నారు. అనంతరం పీఠాధిపతి మహమ్మద్ ప్రవక్త పవిత్ర జ్ఞాపికలకు ప్రత్యేక ఫాతిహా నిర్వహించి భక్తులందరికీ ప్రసాదం పంపిణీ చేశారు.