వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిపిన పోరాట యోధులను అవమానపర్చే బీజేపీ మతోన్మాద శక్తుల కుట్రాలను ఎండగట్టాలని కమ్యూనిస్టు శ్రేణులకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు పిలుపునిచ్చారు.వీర తెలంగాణ రైతంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా మంగళవారం స్టేషన్ ఘనపూర్ చౌరస్తా సెంటర్ లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నేలకొరిగిన అమరవీరులను స్మరిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో సిపిఎం పార్టీ జెండాను రాపర్తి రాజు ఎగురవేశారు.