తెలంగాణ రాష్ట్రంలో యూరియా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిన్ది అని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు.ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం సిపిఎం పార్టీ కార్యాలయం పార్టీ డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించారు సమావేశంలో జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి భూక్య వీరబద్రం పాల్గొన్నారు నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యూరియా సరఫరా చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు రైతులు సాగుచేసిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం సరిపడా యూరియానుసరఫరా చేయకపోవడం వలన రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారూ