2024 డిసెంబర్ 1 వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద పార్క్ చేసిన తన వాహనం కనిపించడం లేదని పరిశుద్ధ రావు అనే వ్యక్తి పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సీఐ వెంకట ప్రసాద్ మంగళవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టి పుట్టా శివశంకర్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకొని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. న్యాయస్థానం నిందితుడుకు నాలుగు నెలలపాటు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.