మలికిపురం MVNJS & RVR కళాశాల అధ్యాపకులు చేపట్టిన నిరసన దీక్షలు గురువారంతో ఏడాది పూర్తి చేసుకున్నాయి. 365 రోజులు గడుస్తున్నా తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీతం అడిగితే బయటకు పంపించిన అధ్యాపకులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.