కడప జిల్లా కమలాపురం వైసీపీ పార్టీ కార్యాలయం నుండి మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఇంచార్జ్ నరేన్ రామాంజుల రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు మద్దతుగా వ్యవసాయ కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ రాష్ట్ర కార్యక్రమమని కొద్ది దూరమైనా ర్యాలీకి అనుమతి ఇవ్వాలని ప్రజల తరుపున ప్రతిపక్షంగా తమకు పోరాడే హక్కు ఉందని ప్రభుత్వం దృష్టికి ప్రజలు, రైతుల సమస్యలను తీసుకెళ్ళే బాధ్యత తమపై ఉందని మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పోలీసులతో వాదించారు. అనంతరం వ్యవసాయ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.